Peddi' OTT release : ఓటీటీలో 'పెద్ది' ర్యాంపేజ్

by Pulgam srinivas |   (  Updated:2026-07-11 05:48:13  IST  )

స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పెద్ది చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్-1 ట్రెండింగ్‌లోకి చేరి సత్తా చాటుతోంది.

Peddi OTT release : ఓటీటీలో పెద్ది ర్యాంపేజ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ ఇటీవల 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జూలై 9న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్-1 ట్రెండింగ్‌లోకి చేరినట్లు సమాచారం. దీంతో థియేటర్లలో విజయాన్ని నమోదు చేసిన 'పెద్ది' డిజిటల్ వేదికపైనా తన జోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు కీలక పాత్రలు పోషించగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story