- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దైవలాగూడ ఆరుగురి హత్య కేసు..క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో చోటుచేసుకున్న ఆరుగురి హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో చోటుచేసుకున్న ఆరుగురి హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం ఘటనాస్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించి కీలక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించాయి. ప్రాథమిక విచారణలో నిందితుడికి గతం నుంచే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన చేపట్టారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో చేవెళ్ల–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలిగింది.
సీఐ, ఎస్‌ఐల సస్పెన్షన్‌కు డిమాండ్..
షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్‌ఐ రమేష్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఇదిలా ఉండగా, గతంలో మైనర్ బాలిక తండ్రి కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మరణం కూడా సహజం కాదని, దానిపైనా సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.






