- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లల కలకలం
మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లల కలకలం.. మూడు పాము పిల్లలను సురక్షితంగా పట్టుకున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ!

దిశ, వెబ్ డెస్క్: మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అకస్మాత్తుగా నాగుపాము పిల్లలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీస్ స్టేషన్ లోపలికి, ఆవరణలో కి పాము పిల్లలు రావడాన్ని గమనించిన పోలీసులు, అక్కడికి వచ్చిన ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై ఒక్కసారిగా పరుగులు తీశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సమీప పొదలు, భూగర్భం నుండి ఇవి బయటకు వచ్చి ఉంటాయని సిబ్బంది భావించారు.
సకాలంలో స్పందించిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’..
పరిస్థితిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వన్యప్రాణుల రక్షణ సంస్థ అయిన 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ' (Friends of Snakes Society) ప్రతినిధులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సొసైటీ సభ్యులు అధునాతన పరికరాలతో మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ దాక్కున్న మూడు నాగుపాము పిల్లలను ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలి వేయనున్నట్లు సొసైటీ సభ్యులు తెలపడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.






