దైవలాగూడ హత్యల కేసులో '7 ఇటుకల' మిస్టరీ

by Ratna Kumari |

షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

దైవలాగూడ హత్యల కేసులో 7 ఇటుకల మిస్టరీ
X

దిశ, చేవెళ్ల : షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం నాగర్‌కుంట చెరువు సమీపంలో నిందితుడు ఏడు ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచినట్లు గుర్తించిన పోలీసులు, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యంపై దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆరు మంది హత్యకు గురైన నేపథ్యంలో ఏడో ఇటుక ఎవరిని సూచిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, ఆ ఇటుకలు ఈ కింది వ్యక్తులను సూచించే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలిక తల్లి, మైనర్ బాలిక, బాలిక నానమ్మ, నిందితుడి భార్య, నిందితుడి పెద్ద కుమారుడు, నిందితుడి రెండో కుమారుడుతో ఆరుగురు కాగా.. ఏడో ఇటుక ఎవరికి..? కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మైనర్ బాలిక తండ్రిని సూచించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల ఆరోపణల ప్రకారం, మైనర్ బాలిక తండ్రి మరణం సహజ మరణం కాదని, దానిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. గతంలో నిందితుడు కుటుంబ సభ్యులను బెదిరించాడని, ఆ విషయమై షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Next Story