పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష

by Malleboina Mahesh |

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ (Rotator Cuff Injuries) ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. పరీక్షల నివేదికలను పరిశీలించిన కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు, దీనికి శస్త్రచికిత్స ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ సర్జరీకి మొగ్గు చూపారు.

వైద్యుల షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ ఉదయం కోకిలాబెన్ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌కు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. "గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో, అత్యంత వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story