- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వశక్తులు ఒడ్డి ఆ చిన్నోడి ప్రాణం కాపాడుతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకొని ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకొని ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారికి తమ ఫౌండేషన్ ద్వారా పూర్తి ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన మనువడిని బతికించావాలంటూ ఒక వృద్ధుడు (తాత) కన్నీరుమున్నీరవుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించారు. "నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.. ఈ మనువడే నాకున్న ఏకైక ఆస్తి. వాడిని ఎలాగైనా కాపాడండి" అని ఆ తాత ఎమ్మెల్యే ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
ఎంత ఖర్చైనా వెనకాడేది లేదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
బాధిత వృద్ధుడి ఆవేదన, చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటానికి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా చిన్నారికి పూర్తి ఉచిత వైద్యం అందించి, అతన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే బాధ్యతను తానే తీసుకుంటానని ఆ తాతకు కొండంత భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆ వృద్ధుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






