- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూభారతి 'సర్వర్ డౌన్'
భూభారతి పోర్టల్ లో సాంకేతిక లోపాల కార ణంగా 15 రోజులుగా కామారెడ్డి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

దిశ, లింగంపేట : భూభారతి పోర్టల్ లో సాంకేతిక లోపాల కారణంగా 15 రోజులుగా కామారెడ్డి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాంతో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు, విక్రయ దారులు తహసిల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేసి చూసి నిరాశగా ఇండ్లకు తిరిగి వెళుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని అవసరమైన పత్రాలను తీసుకుని తాసిల్దార్ కార్యాలయా లకు చేరుకుంటున్న భూముల కొనుగోలు దారులు, విక్రయదారులకు రెవెన్యూ సిబ్బంది సర్వర్ డౌన్ ఉంది అని చెప్పడంతో సాయంత్రం దాక వేచి చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్నీ మండల కేంద్రాల్లో భూము ల రిజిస్ట్రేషన్లు నిలిచిపో వడంతో 15 రోజులుగా ఇబ్బందులు పడుతు న్నారు. భూభారతి సర్వర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో 60 నుంచి సుమారు 100 వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెండింగ్ లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
సర్వర్ డౌన్ ఉంది అందరూ గమనించ గలరు
సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పోస్ట్..
భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్ ఉంది - అందరూ గమనించగలరు అనే సందేశంతో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. 15 రోజులుగా భూభారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి సర్వర్ పని చేయకపోవడంతో కొందరు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తు న్నారు. విషయం తెలియని కొందరు నిరక్షరాసులైన గ్రామీణ ప్రజలు భూముల రిజిస్ట్రేషన్ ల కోసం రోజుల తరబడి తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూభారతి పోర్టల్ లో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి రిజిస్ట్రేషన్ సేవలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.






