- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఫిఫా’ సంచలన నిర్ణయం.. అమ్మకానికి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జరిగే మెట్‌లైఫ్ స్టేడియం గడ్డి పిచ్‌ను ముక్కలుగా చేసి విక్రయించేందుకు ‘ఫిఫా’ సిద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2026) క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే ఫిఫా ప్రపంచకప్ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉపయోగించే అసలైన గడ్డి మైదానాన్ని (Pitch Turf) చిన్న చిన్న ముక్కలుగా చేసి అభిమానులకు విక్రయించనుంది. అయితే, ఫుట్‌బాల్ చరిత్రను తమ సొంతం చేసుకోవాలనుకునే కలెక్టర్లు, డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ‘ఫిఫా’ వెరైటీ ఆఫర్‌ను డిజిటల్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
ఒక్కో ముక్క ధర జస్ట్ రూ.43,000
‘ఫిఫా’ అధికారికంగా ప్రకటించిన ‘పీస్ ఆఫ్ ది పిచ్ - ఫౌండేషన్ ఎడిషన్’ (Piece of the Pitch) కింద లభించే ఒక్కో గడ్డి ముక్క ధరను 450 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.42,989గా నిర్ణయించారు. ఈ గడ్డి ముక్కలు పాడవకుండా ఉండేలా ప్రీమియం యాక్రిలిక్ డిస్‌ప్లే బాక్స్‌లో భద్రపరిచి, దాంతో పాటు ఒక అథెంటిసిటీ ఫిల్మ్, స్పెషల్ యూఎస్‌బీ (USB) మెమొరీ స్టిక్‌ను కలిపి ఒక లగ్జరీ బాక్స్‌లో ప్యాక్ చేసి అందించనున్నారు. అత్యంత ఖరీదైన టాప్ టైర్ గడ్డి ముక్కల ప్యాకేజీ ధర అయితే ఏకంగా 3 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.2.8 లక్షలు వరకు ఉంది. ఈ పిచ్ అమ్మకాతో ‘ఫిఫా’ ఏకంగా 11 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.92 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది.






