జడ్చర్ల కాంగ్రెస్‌లో ముసలం

by Ratna Kumari |

జడ్చర్ల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ మినాజుద్దీన్ సొంత పార్టీ ప్రభుత్వం, స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జడ్చర్ల కాంగ్రెస్‌లో ముసలం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ మినాజుద్దీన్ సొంత పార్టీ ప్రభుత్వం, స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మైనారిటీలపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలకు రూ.10 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, దర్గాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది మైనారిటీలపై చిన్నచూపు కాదా..? మతాల పేరుతో ప్రజలను విభజించే చర్యలు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కానీ జడ్చర్లలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 90 శాతం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని ఆ విషయాన్ని విస్మరిస్తూ మైనార్టీ వర్గాలను చిన్నచూపు చూడడం సరైనది కాదని అన్నారు.

తాను 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని, కానీ ఇప్పుడు కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌లోకి కూడా వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులను పక్కన పెట్టి జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించి పార్టీని నిలబెట్టిన పార్టీ కార్యకర్తలకు పార్టీలో కనీస గౌరవం లేకపోవడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ కార్యకర్తలుగా ఒక్క పని కూడా చేర్పించలేకపోతున్నామని తమను అధికారులు పట్టించుకోవడంలేదని దీంతో తమను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక్క పని కూడా చేపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

జడ్చర్ల కాంగ్రెస్‌లో సీనియర్ - జూనియర్ వర్గాల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉందని, ఈ కారణంగానే పార్టీ బలహీనపడుతోందని అన్నారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన తనకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజాసేవ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, పార్టీని నిలబెట్టడానికి కష్టపడ్డాం. కానీ ఇప్పుడు మమ్మల్ని గుర్తించడం లేదు" అని సయ్యద్ మినాజుద్దీన్ అన్నారు. సయ్యద్ మినాజుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story