- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి విందులో మటన్ పెట్టలేదని కత్తులతో దాడి చేసుకున్న బంధువులు.. వీడియో వైరల్
పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించడంతో బంధువులు కొట్టుకున్నారు. కత్తులు, కర్రలతో దాడి చేసుకోవడంతో 12 మంది గాయపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంధువులందరి ఆనందోత్సహాల మధ్య జరుగుతున్న పెళ్లి వేడుకలో మటన్ కర్రీ చిచ్చు రేపింది. అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి వేడుక ఉన్నట్టుండి హింసాత్మకంగా మారింది. పెళ్లి మెనూలో వధువు తరపు మటన్ కర్రీ వడ్డించలేదని వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఇరువైపుల వారు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా వారందరని ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లో రణరంగాన్ని తలపించిన ఈ ఘటన బిహార్‍లో చోటు చేసుకుంది.
అసలేం జరిగింందంటే?:
బిహార్‍కు చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడు మహ్మద్ అబ్దుల్లా అలియాస్ చాంద్‍కు మహ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెకు రెండు రోజుల క్రితంపెళ్లి జరిగింది. పెళ్లి కార్యక్రమం అంతా హాయిగా సాగుతున్న క్రమంలో భోజనాలు మొదలయ్యాయి. అయితే భోజనాల్లో చికెన్ వడ్డించడంతో వరుడి తరపు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 'మటన్' విందు ఇస్తామని వధువు తరపు వారు తొలుత మాకు చెప్పారని తీరా ఇప్పుడు చికెన్ వడ్డించడం ఏంటని వరుడి తరపు వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో వివాదం రాజుకోవడంతో ఇరువైపుల వారు కర్రలు, కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‍గా మారాయి. ఈ వీడియోల్లో కొందరు వ్యక్తులు అతిథులపై కర్రలతో దాడి చేయడం, ఒకరు ఏకంగా కత్తి పట్టుకుని బెదిరించడం కనిపించింది. అయితే పెళ్లి కూతురు కుటుంబ సభ్యులే తమ బరాత్‍లపై దాడి చేశారని పెళ్లి కొడుకు తరఫు వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






