- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫతేనగర్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్
ఫతేనగర్ పరిధిలో చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న తల్లి, కొడుకును ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, బాలానగర్ : ఫతేనగర్ పరిధిలో చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న తల్లి, కొడుకును ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను చంద్రమ్మ (78), ఆమె కుమారుడు అజయ్‌గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, వీరు తమ నివాసం వద్దే 5 గ్రాముల గంజాయి ప్యాకెట్లను ఒక్కోటి రూ.500కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అందిన సమాచారంతో ఈగల్ ఫోర్స్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుంది.
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 31 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 11 మంది సింగిల్ పేరెంట్ కుటుంబాలకు చెందిన చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో 29 మందికి గంజాయి వినియోగించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.






