- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాప్స్ ఉన్నా తగ్గని నితిన్ క్రేజ్.. లైనప్ చూస్తే షాక్ కావాల్సిందే
వరుస ఫ్లాప్స్ ఎదురైనా నితిన్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హిట్లు అందుకున్న వారికి వరుసగా అవకాశాలు రావడం, అదే వరుస ఫ్లాప్స్ ఎదురైన హీరోలకు అవకాశాలు తగ్గిపోవడం సర్వసాధారణమే. అయితే కొందరు హీరోలు మాత్రం ఫ్లాప్స్ వచ్చినప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంటారు. అలాంటి వారిలో నితిన్ ఒకరు. ఈయనకు సరైన హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. గత కొంతకాలంగా నితిన్ నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.
అయినప్పటికీ ఆయన జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నితిన్ ప్రస్తుతం కొత్త దర్శకులు నారి, సోము దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అలాగే 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు నితిన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నిర్మించనుండగా, షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం.
అలాగే తాజాగా 'ఆయ్' ఫేమ్ అంజి దర్శకత్వంలో కూడా నితిన్ మరో సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇలా వరుస ఫ్లాప్స్ ఎదురైనా కూడా నితిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మూడు సినిమాలను లైన్లో పెట్టి పక్కా ప్రణాళికతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.






