ఆ తేదీపై కన్నేసిన 'ది ప్యారడైజ్' మేకర్స్.. పోటీ లేదు.. టెన్షన్ లేదు

by Pulgam srinivas |

ది ప్యారడైజ్ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ తేదీపై కన్నేసిన ది ప్యారడైజ్ మేకర్స్.. పోటీ లేదు.. టెన్షన్ లేదు
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాలో ఖయాదూ లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తొలుత మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ తేదీన విడుదల కాలేదు. అనంతరం ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా, అప్పటికీ సినిమా సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది.

దీంతో ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనే ఆసక్తి సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, అక్టోబర్‌లో దసరా సందర్భంగా కూడా పలు చిత్రాల రిలీజ్ తేదీలు ఖరారయ్యాయి. అయితే సెప్టెంబర్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో 'ది ప్యారడైజ్'ను సోలోగా విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Next Story