షూటింగ్‌లో గాయపడిన రాశి ఖన్నా.. అయినా వెనక్కి తగ్గలేదు

by Pulgam srinivas |

యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ గాయపడినప్పటికీ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు రాశి ఖన్నా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

షూటింగ్‌లో గాయపడిన రాశి ఖన్నా.. అయినా వెనక్కి తగ్గలేదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. ప్రస్తుతం ఆమె తెలుగుకంటే తమిళ్, హిందీ చిత్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న సమయంలో తనకు గాయమైనట్లు రాశి ఖన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

అయితే గాయమైనప్పటికీ షూటింగ్‌ను ఎక్కడా ఆలస్యం చేయకుండా పూర్తి చేశానని ఆమె తెలిపింది. దీంతో ఆమె అంకితభావాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మహిళా నటి అయినప్పటికీ క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని, గాయాలైనా షూటింగ్‌ను పూర్తి చేయడం నిజంగా అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే, రాశి ఖన్నా ఇటీవల నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలైనా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే ఆ చిత్రంలో ఆమె పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు.

Next Story