T20 వరల్డ్‌కప్ వేళ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 12:28:19  IST  )

టీ20 ప్రపంచకప్ వేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

T20 వరల్డ్‌కప్ వేళ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) వేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. గురువారం బంగ్లా క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, ఢాకాలోని హోటల్ కాంటినెంటల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ మార్చాలని బంగ్లాదేశ్ పట్టుపట్టిన విషయం తెలిసిందే. భారత్‌లోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదేశించింది. కాదు.. కుదరదు అని బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశమిస్తామని బంగ్లా బోర్డును ఐసీసీ హెచ్చరించింది. అంతేకాదు ఆడుతారా? టోర్నీ నుంచి తప్పించమంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ నిర్ణయాన్ని కూడా బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ప్రపంచకప్ ఆడకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో అని క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

READ MORE .... బంగ్లా ఇష్యూ.. ప్ర‌పంచ క‌ప్ పై పాకిస్తాన్ కీల‌క ప్ర‌క‌ట‌న !

T20 WorldCup: బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం!

Next Story