T20 WorldCup: బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం!

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 12:29:10  IST  )

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

T20 WorldCup: బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే టీ20 ప్రపంచకప్‌(T20 WorldCup 2026) టోర్నమెంట్‌లో తమ దేశపు జట్టు పాల్గొనడం లేదని ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో టీ20 ప్రపంచకప్‌లోకి స్కాట్లాండ్ జట్టు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐసీసీ సైతం ఇప్పటికే స్కాట్లాండ్(Scotland) జట్టుకు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. షెడ్యూల్‌తో పాటు వేదికను మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీని రిక్వెస్ట్ చేసింది. షెడ్యూల్ మార్పు అనేది ఇతర జట్లపైనే కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అలాగే తగిన కారణం లేకుండా షెడ్యూల్ మార్చడం భవిష్యత్తులో తప్పుడు సంప్రదాయాలకు దారితీస్తుందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లాదేశ్ అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ మైదానంలోకి దిగనుంది. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారనుంది.

Read More... T20 వరల్డ్‌కప్ వేళ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం

Next Story