- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లా ఇష్యూ.. ప్రపంచ కప్ పై పాకిస్తాన్ కీలక ప్రకటన !
బంగ్లాదేశ్ డిమాండ్లు నెరవేర్చకపోతే, తాము కూడా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ డిమాండ్లు నెరవేర్చకపోతే, తాము కూడా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరోసారి ఐసీసీకి సమాచారం ఇచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. బంగ్లాదేశ్ చేస్తోన్న డిమాండ్లు న్యాయపరమైనవి అంటూ పాకిస్తాన్ చెబుతోంది. వాళ్లకు సంబంధించిన మ్యాచ్ లు శ్రీలంక లేదా పాక్ లో నిర్వహించాలని సూచనలు చేస్తోందట. ఇక ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే, తాము కూడా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
బంగ్లాకు ఇవాళ ఒక్క రోజే ఛాన్స్
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనడంపై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది ఐసీసీ. ఇప్పటికే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన ఐసీసీ, నిన్న మరోసారి అవకాశం ఇచ్చింది. అంటే ఇవాళ సాయంత్రం లోపు బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇక బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ లో ఆడకపోతే, స్కాట్లాండ్ బరిలోకి దిగనుందని అంటున్నారు.
READ MORE ....






