ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడటమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని

by Kodari Anjali |

ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడటమే లక్ష్యంగా బిఎల్ఈలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడటమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: ప్రతి అర్హత కలిగిన ఓటును కాపాడటమే లక్ష్యంగా బిఎల్ఈలు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, మాజీ కార్పొరేటర్లు, సర్ బూత్ ఇన్‌చార్జ్‌లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, సర్ వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నాసీర్ అహ్మద్ లు హాజరయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో ఇప్పటివరకు జరిగిన పని, ఎదురవుతున్న సమస్యలు, బూత్‌ల వారీగా నమోదవుతున్న పురోగతిపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజులు అత్యంత కీలకమని, ఈ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శిలు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఇ వి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story