సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు : సీఈఓకు బీజేపీ రామచందర్ ఫిర్యాదు

by Naga Rani Yarlagadda |

సర్ పేరుతో బీజేపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు.

సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు : సీఈఓకు బీజేపీ రామచందర్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: సర్ పేరుతో బీజేపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పాతబస్తీలో సర్ నిర్వహణ బాధ్యతలను సీనియర్లకు అప్పగించాలని కోరారు. సర్ ను అడ్డంపెట్టుకుని క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై అనర్హులను ఓటర్లుగా చేరుస్తున్నారని ఆరోపించారు. నార్త్ ఇండియా నుంచి వలస వచ్చిన వారికి ఓటుహక్కు లేకుండా చేస్తున్నట్లు సీఈఓకు వివరించారు.

Next Story