- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో సోమవారం భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

దిశ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలో సోమవారం భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గాయపడిన మహిళను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రబోడు తండాకు చెందిన రాంబాబు, రజిని దంపతుల మధ్య గత ఏడాది కాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రజిని ఏన్కూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు స్వయం సహాయక సంఘాల లావాదేవీలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వెళ్లింది. రజిని బ్యాంకుకు వచ్చిన విషయం తెలుసుకున్న రాంబాబు అక్కడికి చేరుకుని ఆమెతో వాగ్వాదానికి దిగడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బ్లూ కోట్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకోగా, రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని మనసులో పెట్టుకున్న రాంబాబు ఏన్కూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, ద్విచక్ర వాహనంపై వచ్చిన రజినిపై కత్తితో దాడి చేసినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. దాడిలో గాయపడిన రజినిని 108 అంబులెన్స్ ద్వారా ఏన్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంధ్య వెల్లడించారు.






