- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల అరెస్టు ప్రభుత్వానికి మంచిది కాదు.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
మహిళా ఐఏఎస్ (IAS) అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై సీసీఎస్ (CCS)లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

దిశ, సంగారెడ్డి బ్యూరో: మహిళా ఐఏఎస్ (IAS) అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై సీసీఎస్ (CCS)లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం 'సిట్' (SIT) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్న ఎన్టీవీ (NTV) ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ఛానల్‌కు చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జర్నలిస్టులను అర్దరాత్రి అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదని, ఇది ప్రభుత్వానికి ఇబ్బందుకు వస్తాయని, సిట్ అధికారులు సంయమనం పాటించాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కొన్ని చానల్స్ లో మంత్రుల మీద, ఉన్నతాధికారుల మీద వ్యక్తిగతంగా ఆధారాలు లేకుండా కించపరిచే విధంగా కథనాలు వచ్చాయి. ఆ విషయంలో తాను కూడా తీవ్రంగా స్పందించానని గుర్తు చేశారు. అలాంటి వార్తలు వేయడం సమాజానికి మంచిది కాదని, మంత్రులు, ఐఏఎస్ అధికారులు కావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వారి జీవితాలను ఇలా ప్రసారం చేయడం దుర్మార్గమని ఖండించినట్లు గుర్తు చేశారు. అయితే ఈ వార్తల నేపత్యంలో అసలు విషయాలు ఏమిటి..? ఎవరు దీనికి సూత్రధారులు అని తెలుసుకోవడానికి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సిట్ వేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇది మంచిదే.. సిట్ కూడా సజ్జనార్ లాంటి సీనియర్ అధికారితో వేయడంతో నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిందేనని, ఒక మహిళా అధికారిపై ఇలా వేయడాన్ని ఎవరు సమర్థించరన్నారు. కానీ సిట్ అధికారులు ఈ విషయంలో చాలా సంయమనం పాటించాలని విజ్ఞప్తి జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అధికారులు ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో, ఎవరినైతే మీరు విచారణ చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తే చాలా బాగుండేదని అభిప్రాయ పడ్డారు. కానీ పండుగ పూట సీనియర్ జర్నలిస్ట్ లను విచారణ పేరుతో మధ్యరాత్రి అరెస్టులు చేసి తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం కొంత ఇబ్బందుల పాలు అవుతుందని, రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురి అవుతుందన్నారు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగేపడే పరిస్థితి ఉందని, అందువల్ల సిట్ అదికారులు చాలా కూల్ మైండ్ తో సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అటు అధికారులకు న్యాయం జరగాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలన్నారు. అదే సమయంలో భయాందోళనకు గురి కాకుండా చూడాలని జగ్గారెడ్డి కోరారు.






