- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి
అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టుల విషయంలో డీజీపీతో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. పండుగ పూట కోర్టు సెలవులు ఉన్న సమయంలో, ఎయిర్‌పోర్టులో జర్నలిస్టును అరెస్ట్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు టెర్రరిస్టులా..? అర్ధరాత్రి జర్నలిస్టుల ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేయడం ఏంటి ప్రశ్నించారు. అరెస్టు చేసేందుకు న్యాయపరమైన నిబంధనలు పాటించాలని హరీష్ రావు అన్నారు.
Read More... మీడియాపై దాడులు రేవంత్ పాలనకు నిదర్శనం : జర్నలిస్టుల అరెస్టుపై కేటీఆర్ ఫైర్
జర్నలిస్టుల అరెస్టు ప్రభుత్వానికి మంచిది కాదు.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
Next Story






