గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసీటీ కంప్యూటర్ల ప్రారంభం

by Batti.Sumithra |

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఐసీటీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన కంప్యూటర్లను మండల విద్యాధికారి మేకర్తి వెంకటేశ్వర్లు, గంగాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశం, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ భీంబాయి సంయుక్తంగా ప్రారంభించారు.

గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసీటీ కంప్యూటర్ల ప్రారంభం
X

దిశ, రెబ్బెన : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఐసీటీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన కంప్యూటర్లను మండల విద్యాధికారి మేకర్తి వెంకటేశ్వర్లు, గంగాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశం, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ భీంబాయి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడంలో ఐసీటీ కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్బత్‌రావు, ఉపాధ్యాయులు దుర్గం శ్రీనివాస్, రత్నం సంజీవ్, దుర్గం రాజేష్, బద్రి జాన్సీతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story