- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ నోటీసుల వేళ హిమాన్షు ఆసక్తికర పోస్ట్.. పొలం పనుల్లో గులాబీ బాస్ బిజీబిజీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ (KCR)కు నోటీసుల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ (KCR)కు నోటీసుల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అగ్గిరాజేసింది. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ మీద ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తుందని కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు చేసింది తప్పని గ్రహించక సర్కారుపై ప్రధాన ప్రతిపక్షం కాలు దువ్వుతోందని, మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి..? విచారణలో భాగంగా చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రులు వారికి కౌంటర్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు (Himanshu) తన ఫేస్‌బుక్ (Facebook) ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో కేసీఆర్ తన ఎర్రవెల్లి (Erravelli) ఫామ్‌హౌస్‌లో పొలంలో నిలబడి ఉన్నారు. ఎదురుగా ఉన్న ఓ ట్రాక్టర్‌లో మొక్కలను పని వాళ్లతో అన్‌లోడ్ చేయిస్తూ కనిపించారు. అయితే, హిమాన్షు ఆ ఫొటోకు ‘మొదలు రైతు కదా, ఆ గుండెకి మట్టిని తాకితేనే సంతృప్తి ఉంటది. ఎంత ఎత్తుకు ఎదిగినా, మన మూలాలను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తిత్వానికి కేసీఆర్ నిలువెత్తు నిదర్శనం’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజెన్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చినా.. గులాబీ బాస్ ఇంత కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడేంట్రా అని కామెంట్ చేస్తున్నారు.
Read More... ఇది అహంకారం కాకపోతే మరేంటి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
KCR: సిట్ నోటీసులపై ఏం చేద్దాం..? నేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు






