- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: సిట్ నోటీసులపై ఏం చేద్దాం..? నేతలు, న్యాయవాదులతో కేసీఆర్ సమాలోచనలు
సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ చర్చలు ఆసక్తిగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) రేపు విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సిట్ (SIT) నిన్న జారీచేసిన నోటీసులుపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పార్టీ ముఖ్యనేతలు, న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి ఎర్రవల్లిలోనే (Erravalli Farmhouse) కేటీఆర్, హరీశ్‌రావు ఉండగా ఇవాళ ఉదయం నుంచి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఫామ్ హౌస్‍కు చేరుకుంటున్నారు. సిట్ నోటీసులపై కోర్టుకు వెళ్దామా లేక విచారణకు హాజరు అవుదామా అనే విషయంలో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను ఎర్రవల్లిలో ఉంటున్నానని తదుపరి నోటీసులు, విచారణ ఏదైనా ఇదే చిరునామా కింద జరపాలని కోరినప్పటికీ సిట్ అధికారులు మాత్రం నందినగర్ నివాసానికే వెళ్లడం అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అతికించడం పట్ల ఏం చేద్దామనేదానిపై డిస్కషన్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
కలిసివస్తుందా? బెడిసికొడుతుందా?:
గురువారం ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తాను మున్సిపోల్స్ బిజీలో ఉన్నానని అందువల్ల శుక్రవారం నాటి విచారణకు హాజరుకాలేనని కేసీఆర్ సిట్ అధికారులకు బదులిచ్చారు. విచారణకు మరో తేదీని నిర్ణయించాలని సూచించారు. అయితే కేసీఆర్ ఇచ్చిన సమాధానానికి గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన సిట్ అధికారులు ఆదివారమే విచారణకు సిద్ధంగా ఉండాలని రెండోసారి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు బీఆర్ఎస్ కు టెన్షన్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా బీ ఫామ్స్ పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. రెబల్స్ గొడవ ఇంకా భగ్గుమంటూనే ఉంది. అభ్యర్థులనంతా బుజ్జగించుకునే సమయంలో పార్టీ ముఖ్యనేతలంతా కేసీఆర్ విచారణ చుట్టూ ఫోకస్ చేస్తే అది ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనే చర్చ గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేసీఆర్ సిట్ దర్యాప్తు విషయంలో ఎలా ముందుకు వెళ్తే రాజకీయంగా కలిసి రాబోతోంది? లీగల్ గా తన వైపు అనుకూలత ఉండబోతోంది అనే అంశాలపై బేరీజు వేసుకుకుని ముందడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read More... ఇది అహంకారం కాకపోతే మరేంటి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం






