- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది అహంకారం కాకపోతే మరేంటి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో గులాబీ బాస్‌కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో గులాబీ బాస్‌కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్ (Nandi Nagar)లోని నివాసానికి వెళ్లగా అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఆ నోటీసులలో ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ క్రమంలోనే గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆరే తాను ఉంటున్న నివాసం అడ్రస్‌తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని అన్నారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతీక్రమిస్తున్నారని ఆరోపించారు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా..? లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అంటూ ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ తమకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. అక్రమ కేసులన్నీ చేధిస్తామని.. ప్రభుత్వం ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందుపెడతామని అన్నారు. అన్ని వేధింపులను తెలంగాన ప్రజలకు నిషితంగా గమనిస్తున్నారని. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే వారు సర్కారుకు బుద్ధి చెబుతారని కామెంట్ కేటీఆర్.






