హరీశ్ రావుకు అలా కేసీఆర్ కు ఇలా.. సిట్ నోటీసులపై కొత్త చర్చ

by Prasad Jukanti |   (  Updated:2026-01-31 06:34:15  IST  )

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లడంపై చర్చ జరుగుతోంది.

హరీశ్ రావుకు అలా కేసీఆర్ కు ఇలా.. సిట్ నోటీసులపై కొత్త చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హైదరాబాద్ లోనే విచారణకు రావాలని సిట్ మరోసారి నోటిసులు జారీ చేయడం కొత్త చర్చకు దారి తీసింది. కేసీఆర్ కోరినట్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ కుదరదని హైదరాబాద్ లోనే విచారణ జరుపుతామని ఇల్లా, పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి అంటూ నిన్న నందినగర్ లోని నావాసానికి సిట్ (SIT Notice) అధికారులు నోటీసులు అంటించి వెళ్లారు. అయితే నోటీసులు ఇంటి గోడకు అతికించడంపై ఇవాళ చర్చ మొదలైంది. ఇలా గోడకు నోటీసులు అంచించం కుదరదని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని న్యాయనిపుణలు చెబుతుండగా హైదరాబాద్ లోనే విచారిస్తామని సిట్ స్పష్టం చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సిట్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇప్పుడు చిరునామా చిచ్చు కొత్త వివాదంగా మారింది.

హరీశ్‍కు అలా కేసీఆర్‍కు ఇలా:

తొలుత గురువారం ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేసీఆర్ తాను మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందునా శుక్రవారం నాటి విచారణకు హాజరుకాలేనని సిట్ కు సమాధానం ఇచ్చారు. అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఇకపై విచారణకు ఎర్రవల్లిలోని నా నివాసానికే రావాలని కోరారు. అయితే కేసీఆర్ ఇచ్చిన రిప్లయ్ పై స్పందించిన సిట్ శుక్రవారం మరో నోటీసు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. అయితే కేసీఆర్ కోరినట్లు ఎర్రవల్లిలో కాకుండా నందినగర్ లోని నివాసానికి నోటీసులు అతికించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో తన అడ్రస్ నందినగర్ నివాసాన్నే పేర్కొన్నారని అందువల్ల ఆయనకు నందినగర్ లోనే నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నాయి. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం సిట్ తీరును తప్పుబడుతున్నారు. ఇదే నిజం అయితే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తన ఎన్నికల అఫిడవిట్ లో సిద్ధిపేట అడ్రస్ ఇచ్చారని మరి సిద్ధిపేట అడ్రస్ ఉన్న హరీశ్ రావుకు నార్సింగ్‍ నివాసంలో ఎందుకు నోటీసులు ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పై ద్యాప్తు అధికారులు వేయబోయే ప్రశ్నల కంటే ఎక్కడ ప్రశ్నించబోతున్నారు అనేదే ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి ఈ అడ్రస్ వివాదంలో అంతిమంగా ఏం జరగబోతోందో వేచి చూడాలి.

Read More... ఇది అహంకారం కాకపోతే మరేంటి.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

Next Story