- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం: బండి సంజయ్
సైదాబాద్ లోని ఓ స్కూల్ లో హిందూ విద్యార్థులకు కల్మా చదవాలని హోం వర్క్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని సైదాబాద్‍లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ ఘటనను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వదిలేస్తా రాష్ట్రమంతా విస్తరించే ప్రమాదం:
ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ ను పోలీసులు, మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని భరత్‍ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోల్లో, గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకో న్యాయం? భరత్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు.






