- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచంపల్లిని సందర్శించిన అమెరికా, కెనడా దేశస్తులు
by Jakkula.Mamatha |
చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు అమెరికా, కెనడా దేశస్తులు గురువారం పోచంపల్లిని సందర్శించారు.

X
దిశ,భూదాన్ పోచంపల్లి: చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు అమెరికా, కెనడా దేశస్తులు గురువారం పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టూరిజం పార్కులోని మగ్గాలు, నూలు దారం, రంగులు అద్దకం, చిటికిలు చుట్టడం, మగ్గంపై నేసే చీర తయారీ ప్రక్రియను పరిశీలించారు. చేనేత కళాకారులు కళాత్మకంగా తయారు చేస్తున్న చీరలను చూసి అభినందించారు. చేనేత కళాకారుల కళా నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టూరిజం పోలీసులు రాజశేఖర్, భవాని, పాపయ్య, లావణ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






