- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటకలుస్తున్న మానవత్వం.. 8 నెలల పసికందుపై బ్లేడ్‌తో దాడి.. పొదల్లో పడేసిన ఉదంతం!
బీర్కూర్ మండల కేంద్రంలో ఎనిమిది నెలల పసిపాప శరీరంపై బ్లేడ్‌తో గాట్లు పెట్టి పొదల్లో పారేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో ఎనిమిది నెలల పసిపాప శరీరంపై బ్లేడ్‌తో గాట్లు పెట్టి పొదల్లో పారేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక వివరాల ప్రకారం.. సతీష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య శైలజకు ముగ్గురు కూతుళ్లు కాగా, రెండో భార్య సంధ్యకు ఒక కుమార్తె (వర్ష - 8 నెలలు). కాగా, శైలజ, సంధ్య ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. ఐదు నెలల క్రితం భర్త సతీష్‌తో గొడవ జరగడంతో చిన్న భార్య సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మూడు నెలల వయసున్న పసిపాప వర్షను సతీష్ తన వద్దే ఉంచుకున్నాడు. ప్రస్తుతం ఎనిమిది నెలల వయసున్న పాప అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కులస్థులు సైతం పాప కోసం గాలిస్తుండగా.. తండ్రి సతీష్ అప్రమత్తమై, పక్కనే ఉన్న పొదల్లో పాప దొరికిందంటూ అందరి ముందుకు తీసుకువచ్చాడు.
తీరా చూస్తే.. పాప శరీరంపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసిన గాట్లు, ఒంటి నిండా రక్తంతో పసికందు అపస్మారక స్థితిలో ఉంది. ఆ చిన్నారి పరిస్థితి చూసి అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేక కుటుంబ సభ్యులలో ఎవరైనా చేశారా? అనే కోణంలో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణమైన ఘాతుకానికి కారణమైన దుర్మార్గులకు పట్టుకుని పోలీసులు శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.






