క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం.. యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక ‘ఇన్-హౌస్ NGS’ సేవలు షురూ!

by Jakkula.Mamatha |

క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ.. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (ఎన్ జి ఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది.

క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం.. యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక ‘ఇన్-హౌస్ NGS’ సేవలు షురూ!
X

దిశ, ​హనుమకొండ కలెక్టరేట్: క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ.. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (ఎన్‌జీఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది. క్యాన్సర్ రోగుల జన్యు నిర్మాణాన్ని విశ్లేషించి, వారికి అత్యంత ఖచ్చితమైన, వ్యక్తిగతీకరించిన వైద్యం అందించడంలో ఈ సాంకేతికత కీలక మైలురాయిగా నిలవనుంది. గురువారం రోజున హనుమకొండ యశోద క్లినిక్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్(క్యాన్సర్ నిపుణులు) డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ.. ​ప్రస్తుతం వైద్యరంగం సాంప్రదాయ "అందరికీ ఒకే రకమైన చికిత్స" విధానం నుండి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక చికిత్సలైన టార్గెటెడ్ ఓరల్ థెరపీలు, ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వంటి రోగుల జీవనకాలాన్ని, వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, యశోద హాస్పిటల్స్ సొంతంగా (ఇన్-హౌస్) ఈ ఎన్ జి ఎస్ ల్యాబ్ ఏర్పాటు చేయడం విశేషం. ​ఇన్-హౌస్ ఎన్ జి ఎస్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు, వేగవంతమైన నివేదికలు, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల రోగి యొక్క జన్యుపరమైన మార్పులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చును.

పరీక్షా ఫలితాల ఆధారంగా ఆంకాలజిస్టులు ప్రతి రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చికిత్సను డిజైన్ చేయడానికి వీలవుతుంది అన్నారు.ముఖ్యంగా ఊపిరితిత్తుల (Lung), రొమ్ము (Breast), జీర్ణాశయ సంబంధిత (Gastrointestinal) క్యాన్సర్లతో పాటు ఇతర కణితుల (Tumors) చికిత్స నిర్ణయాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది."సొంతంగా NGS సదుపాయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రెసిషన్ ఆంకాలజీ విభాగంలో యశోద హాస్పిటల్స్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. అత్యాధునిక సాంకేతికతను రోగులకు మరింత వేగంగా, చేరవ చేయడమే లక్ష్యం అని అన్నారు.

Next Story