ప్రభుత్వ కళాశాల సాక్షిగా వాల్టా చట్టానికి తూట్లు

by Batti.Sumithra |

ప్రభుత్వ అధికారులే చట్టాలను గౌరవించకుండా ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారు.

ప్రభుత్వ కళాశాల సాక్షిగా వాల్టా చట్టానికి తూట్లు
X

దిశ, భద్రాచలం : ప్రభుత్వ అధికారులే చట్టాలను గౌరవించకుండా ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాల్టా చట్టాన్ని అపహాస్యం చేస్తూ... ప్రాంగణంలో ఉన్న దశాబ్దాల కాలం నాటి చెట్లను నరికివేయడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేత పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇటీవల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు క్రికెట్ క్యాంప్ నిర్వహణ కోసం చెట్లను నరికివేయడం, కలశాల అధికారులు అడ్డుకోకపోవడం పట్ల భద్రాద్రికా మహారాజ్ సంస్థ నిర్వాహకులు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కు పిర్యాదు చేశారు. చెట్లు తొలిగించాడానికి అనుమతులు తీసుకున్నారా..? తీసుకుని ఉంటే అనుమతులు ఎవరిచ్చారో తెలియపర్చాలని ఆ పిర్యాదులో కోరారు. ప్రజా ప్రయోజనాల కొరకు తప్పనిసరి పరిస్థితిలో చెట్లను తొలిగిస్తే పరవాలేదు కాని.... క్రికెట్ గ్రౌండ్ కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులు తొలిగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాల్టా చట్టంను పరిరక్షించాల్సిన తహసీల్దార్, పంచాయతీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story