- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు!
న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో(South Island) గురువారం భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలో(South Island) గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ సంస్థ(GeoNet) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:14 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టె అనావ్ (Te Anau) పట్టణానికి ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో సుమారు 51 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో టె అనావ్‌తో పాటు క్వీన్స్‌టౌన్, డునెడిన్ వంటి నగరాల్లో సంభవించిన తీవ్ర ప్రకంపనలకు ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీశారు.
తీవ్రమైన ఈ భూకంపం కారణంగా న్యూజిలాండ్ తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందంటూ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) తక్షణ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 'మిల్‌ఫోర్డ్ సౌండ్' (Milford Sound) నుండి 'పుయ్‌సెగర్ పాయింట్' (Puysegur Point) వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్షణం సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది. కాగా ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.






