- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్యప్రాణుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
తిరుపతి ఎస్వి జూ పార్కు అభివృద్ధికి అన్నీ విధాల సహకారం అందించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వన్య ప్రాణులు, పర్యావరణ కమిటీ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు...

దిశ, తిరుపతి ప్రతినిధి: తిరుపతి ఎస్వి జూ పార్కు అభివృద్ధికి అన్నీ విధాల సహకారం అందించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వన్య ప్రాణులు, పర్యావరణ కమిటీ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ విసి హాల్ నందు వన్య ప్రాణులు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురువారం తిరుపతి ఎస్ వి జూ పార్క్ అభివృద్ధిపై తీసుకోవలసిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ వన్య ప్రాణులు, పర్యావరణ కమిటీ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జనరల్ సెక్రెటరీ లెజిస్లేచర్ ప్రసన్న కుమార్ సూర్య దేవరలతో కలసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వన్య ప్రాణులు, పర్యావరణ కమిటీ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చాలా తక్కువ రాష్ట్రాలలో మాత్రమే ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీని చట్ట సభల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ ద్వారా తిరుపతి ఎస్వి జూలాజికల్ పార్క్‌ను సందర్శించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలలో జూ పార్క్‌లు ఉన్నాయని, తిరుపతి ఎస్వి జూ పార్క్ 3100 ఎకరాలలో ఏర్పాటు చేయబడి విస్తరణ పరంగా ఆసియాలో అతిపెద్ద జూ పార్క్‌గా పేరుగాంచినదన్నారు. ఎస్వి జూ పార్క్ అభివృద్ధికి దాదాపు రూ.6 కోట్లు అవసరం అవుతుందన్న అంచనా ఉందని, ఇందులో రూ.3 కోట్లు టిటిడి నుండి సమీకరించడం జరుగుతుందని, మిగిలిన రూ.3 కోట్లను జిల్లా కలెక్టర్ సిఎస్ఐఆర్ నిధుల ద్వారా సేకరించవలసి ఉందన్నారు. వీటితో పాటు ఎంఎల్ఏలు, లోక్ సభ సభ్యుల ద్వారా మరింత నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 95 వేల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతికి వస్తున్నారని, ఇందులో సరాసరి 4 శాతం యాత్రికులు మాత్రమే ఎస్వి జూ పార్క్ ను సందర్శిస్తున్నారని, కనీసం 8 శాతం మంది యాత్రికులు ప్రతి రోజూ ఎస్వి జూ పార్క్‌ను సందర్శించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జూ పార్క్‌లో అనుమతించిన మేర అడ్వెంచర్, ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూడాలని తెలిపారు. జూపార్క్ చుట్టూ 13 కి.మీల మేర కాంపౌండ్ వాల్ పడిపోయిందని, కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం చేయుటకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి జూ పార్క్‌ల అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్ ద్వారా కేటాయింపుకు కృషి చేస్తామన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో కమిటీ మెంబర్‌లు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాకుళం, బాపట్ల ఎంఎల్ఏలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, గోండు శంకర్, వి. నరేంద్ర వర్మ, ఎం ఎల్ సి పాలవలస విక్రాంత్, జేసి ఆర్. గోవింద రావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మరియు హెచ్ ఆర్ డి నాగేశ్వర రావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతి సర్కిల్ వై . శ్రీనివాసులు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సోషల్ ఫారెస్టరీ మరియు జూ పార్క్స్ బి ఎన్ ఎన్ మూర్తి, డిఎఫ్ఓ సాయిబాబా, డిఆర్ఓ జి. నరసింహులు, స్టేట్ సిల్వికల్చరిస్ట్, బయో ట్రిమ్ ఎం. బబిత, డివిజినల్ ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






