- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Windfall Tax: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
దేశీయ మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించింది. జూలై 16 నుంచి డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్నును లీటరుకు రూ.8.5 నుంచి రూ.15.5కు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై రూ.7.5 నుంచి రూ.14.5కు పెంచగా, పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని రూ.4 నుంచి రూ.2.5కు తగ్గించింది. అయితే దేశీయ మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు. యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన సమయంలో ఎగుమతిదారులు అధిక లాభాలు పొందకుండా చూడటంతో పాటు, దేశీయంగా ఇంధన లభ్యతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ సుంకాలను సమీక్షిస్తూ, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తోంది.






