నీట్ యూజీ పేపర్ లీక్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ

by Kema Shiva Kumar |

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నిందితులు దినేష్ బివాల్, వికాస్ బివాల్‌లు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్పెషల్ సీబీఐ (CBI) కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా (Ajay Gupta) ఆ బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనున్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 13 మంది కీలక నిందితులలో దినేష్ బివాల్, వికాస్ బివాల్ కూడా ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులందరికీ కోర్టు ఇప్పటికే జూలై 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో వారంతా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. రేపటి కోర్టు విచారణలో వీరికి బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story