- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో గొడవపడి అదృశ్యమైన యువకుడు
కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగిన అనంతరం పొలానికి వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కోదండపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, ఎర్రవల్లి : కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగిన అనంతరం పొలానికి వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన కోదండపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కోదండపురం ఎస్‌ఐ తరుణ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెపాడు గ్రామానికి చెందిన గొల్ల రమేష్ (28) బుధవారం ఇంట్లో కుటుంబ సభ్యులతో స్వల్ప వాగ్వాదం జరిగిన తర్వాత మనస్తాపానికి గురై, పొలానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రమేష్ కోసం పొలం వద్ద, బంధువుల ఇళ్లలో, తెలిసిన వారి వద్ద గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం అతని తండ్రి గొల్ల బుచ్చన్న కోదండపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తరుణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రమేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.






