అంగరంగ వైభవంగా బోనాలు ప్రారంభం

by Taduka Kalyani |

డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల ప్రారంభమయ్యాయి.

అంగరంగ వైభవంగా బోనాలు ప్రారంభం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని తరలివచ్చారు. ఇందులో భాగంగా కట్టమైసమ్మ ఆలయంలో కుమ్మర కులస్తులు మొదటి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆచారం ప్రకారం మొదటి బోనం సమర్పించాల్సి ఉండగా 133 జిల్లాల నుంచి వెయ్యి బోనాలు తీసుకువచ్చి కట్ట మైసమ్మ అమ్మవారికి సమర్పించారు. సుమారు 5000 మంది కుమ్మరులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఆధ్యంతం భక్తి పరవశం ఉట్టి పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్, శంకరయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మహిళా నాయకురాలు నాగ పరిమళ, కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు, కార్యనిర్వాక అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దయానంద్, కోశాధికారి వీరయ్య, ప్రోగ్రాం కన్వీనర్ ఆడ్డాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story