- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. NEET (UG) రీఎగ్జామ్ ఫలితాలు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ (NEET UG) రీఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) రీఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు ఎట్టకేలకు రానేవచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం అభ్యర్థుల్లో 11.21 లక్షల మంది విద్యార్థులు మెడికల్ కౌన్సిలింగ్‌కు అర్హత సాధించారని ఎన్‌టీఏ వెల్లడించింది. అయితే, అనూహ్యంగా ఈసారి ఫలితాల్లో విద్యార్థులు భారీ మార్కులు సాధించగా.. అగ్రస్థానంలో పంజామ్, హర్యానా విద్యార్థులు ఉన్నారు. మొత్తం 720 మార్కులకు గాను, 138 మంది విద్యార్థులు 690 కంటే ఎక్కువ మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. జనరల్ కేటగిరిలో 2.91 లక్షల మంది, ఓబీసీ కేటగిరిలో5.12 లక్షల మంది, ఎస్సీ కేటగిరిలో 1.59 లక్షల మంది, ఎస్సీ కేటగిరిలో 63,716 మంది క్వాలిఫై అయ్యారు. ఇక ఎన్టీఏ ఫైనల్ ‘కీ’ని వెబ్‌సైట్‌లో పెట్టిన గంటల వ్యవధిలో ఫలితాలు విడుదల కావడం గమనార్హం.
కాగా, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్షలో భారీగా ప్రశ్నాపత్రాల లీకేజీ (Paper Leak) జరిగిందన్న ఆరోపణలు, దేశవ్యాప్త వివాదాల నేపథ్యంలో ఎన్‌టీఏ స్పందించింది. లీకేజీ ప్రభావిత ప్రాంతాల్లోని అభ్యర్థులకు జూన్ 21న తిరిగి రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ మేరకు ఆ తుది ఫలితాలను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోచ్చని అధికారులు వెల్లడించారు.






