- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-UK: భారత్-యూకే వాణిజ్య ఒప్పందానికి శుభారంభం
దీనివల్ల టెక్స్‌టైల్స్, చేతివృత్తులు, ఇంజనీరింగ్, సముద్ర ఆహార ఉత్పత్తులతో పాటు రత్నాలు, ఆభరణాల రంగానికి బ్రిటన్ మార్కెట్లో 'జీరో టాక్స్' ప్రవేశం లభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, బ్రిటన్ (యూకే) మధ్య చారిత్రాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' (సీఈటీఏ) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి రావడం దేశీ వాణిజ్య రంగానికి సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుంచి 140 మిలియన్ డాలర్ల(రూ. 1,350 కోట్ల) విలువైన 50 సరుకుల రవాణా యూకేకు విజయవంతంగా జరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సరికొత్త అధ్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ, ఈ ఒప్పందం మన రైతులు, పారిశ్రామికవేత్తలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సరికొత్త ఊపునిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల టెక్స్‌టైల్స్, చేతివృత్తులు, ఇంజనీరింగ్, సముద్ర ఆహార ఉత్పత్తులతో పాటు రత్నాలు, ఆభరణాల రంగానికి బ్రిటన్ మార్కెట్లో 'జీరో టాక్స్' ప్రవేశం లభించింది. మొదటి రోజే మన ఎగుమతిదారులు దాదాపు 10 మిలియన్ డాలర్ల(రూ. 96 కోట్ల) విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలను బ్రిటన్‌కు పంపగా, రాబోయే మూడేళ్లలో ఈ ఎగుమతులు 2.5 బిలియన్ డాలర్ల(రూ. 24 వేల కోట్ల)కు చేరుకుంటాయని పరిశ్రమల మండలి ధీమాగా వ్యక్తం చేసింది. కస్టమ్స్ క్లియరెన్స్, డిజిటల్ సర్టిఫికెట్ల జారీ పరంగా మొదటి రోజు నుంచే ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులభతరమైన ఏర్పాట్లు చేసినట్లు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.






