- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనకు తమిళంలో ఆదారణ దక్కదు.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ జులై 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ జులై 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘నా సినిమా రిలీజ్ ఉన్న సమయంలో ఏదైన తమిళ సినిమా థియేటర్స్ విషయంలో నాకు పోటీగా వస్తుందా అని నేను భయపడతాను. నా సినిమా అనే కాదు.. రీసెంట్‌గా అఖిల్ అన్న ‘లెనిన్’ రిలీజ్ అయింది. ఇక్కడ సూర్య ‘కరుప్పు’కు దక్కింది.. తమిళంలో ‘లెనిన్’కు అదే రేంజ్‌లో మార్కెట్ దక్కుంటే వేరే రేంజ్‌లో ఉంటుంది. అదే నా బాధ. మాకు థియేటర్లు ఎందుకు ఇవ్వడం లేదని నేను ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్‌ను అడిగాను. అతను, 'మేము మీకు థియేటర్లు ఇస్తాము, కానీ మా ప్రజలు మీ సినిమాలు చూడటానికి రారు' అని అన్నాడు. మనం వారి సినిమాలకు ఇచ్చే ప్రేమలో కనీసం 50% తమిళ ప్రేక్షకులు మాకు ఇచ్చినా, అది చాలు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.






