- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ వార్డెన్లకే డీఈఓ బాధ్యతలు.. టీజీఎంఆర్ఈఐఎస్ కీలక నిర్ణయం
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎంఆర్ఈఐఎస్) పరిధిలో విడిగా నడుస్తున్న జూనియర్ కాలేజీల అడ్మినిస్ట్రేషన్‌లో మార్పులు చేస్తూ సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా బాబా సర్క్యులర్ జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎంఆర్ఈఐఎస్) పరిధిలో విడిగా నడుస్తున్న జూనియర్ కాలేజీల అడ్మినిస్ట్రేషన్‌లో మార్పులు చేస్తూ గురువారం సొసైటీ సెక్రటరీ షఫీవుల్లా బాబా సర్క్యులర్ జారీ చేశారు. పని భారం తక్కువగా ఉండటం, ఇతర పరిపాలనా కారణాల వల్ల ఇకపై డిప్యూటీ వార్డెన్, డీఈఓ రెండు పోస్టులను కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు రీజినల్ లెవల్ కోఆర్డినేటర్లకు (ఆర్ఎల్సీ) జారీ చేసిన సర్క్యులర్‌లో విడిగా కొనసాగుతున్న జూనియర్ కాలేజీల క్యాంపస్‌లలో డీఈఓ పోస్టులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న డిప్యూటీ వార్డెన్లు తమ రెగ్యులర్ విధులతో పాటు, డీఈఓ బాధ్యతలను కూడా అదనంగా నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యూటీ వార్డెన్‌గా కొనసాగాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ వార్డెన్‌కు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే, వారిని తొలగించి, ఆ స్థానంలో డీఈఓకే డిప్యూటీ వార్డెన్ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ కొత్త ఏర్పాట్ల వల్ల కాలేజీల హాస్టల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని సెక్రటరీ ఆదేశించారు.






