- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ వేముల బిల్లుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
'రోహిత్ వేముల బిల్లు'పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోహిత్ వేముల బిల్లు (Rohit Vemula Bill) అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉన్నత విద్యా సంస్థల్లో వివక్ష రూపుమాపేలా రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తుది రూపునిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లును త్వరగా సిద్ధం చేయాలని అధికారులను కూడా ఆదేశించామని తెలిపారు. త్వరలోనే రోహిత్ వేముల బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Next Story






