సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు..

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను రాష్ట్రమంత్రులు గురువారం అశ్వాపురం మండలంలో పరిశీలించారు.

సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు..
X

దిశ, అశ్వాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను రాష్ట్రమంత్రులు గురువారం అశ్వాపురం మండలంలో పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీను, కోరం కనకయ్య, ప్రముఖులు జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు సమీక్ష సమావేశం నేపథ్యంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అవసరమైన సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, సమీక్ష సమావేశం విజయవంతంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సీతమ్మసాగర్ ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుకు సంబంధించిన పలుసమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, నీటిపారుదల శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు జిల్లా ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భద్రతాప్రమాణాలు, బారికేడింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, రాకపోకల ఏర్పాట్లను పకడ్బందీగా చేసి వచ్చిన అధికారులకు ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యటన జయప్రదం చేశారు.

Next Story