- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. రేపు ఈహెచ్ఎస్ సేవలు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు నూతన ఆరోగ్య పథకం (EHS) ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తీపికబురు అందించింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం(Employees Health Scheme) రేపు అధికారికంగా ప్రారంభం కానుంది. సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు.
కొత్త పోర్టల్ ప్రారంభం.. హెల్త్ కార్డుల పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ (EHS) పోర్టల్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లాంచ్ చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డుల పంపిణీని కూడా ఆయన రేపు ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందనున్నాయి.
Next Story






