- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన కూకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, కొండపాక: పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన కూకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. కూకునూర్ పల్లి ఎస్ ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ శివార్లలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో గురువారం రాత్రి కుకునూర్ పల్లి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కొడకండ్ల గ్రామానికి చెందిన ఎనకపల్లి ఐలయ్య, జెర్రిపోతుల ఎల్లయ్య, చేర్యాల కరుణాకర్‌లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. కాగా, గుండు కరుణాకర్ అనే మరో వ్యక్తి పోలీసుల నుండి తప్పించుకొని పరారయ్యాడు.నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 6,390 నగదు, 3 మొబైల్ ఫోన్లు, 3 బైకులనుస్వాధీనం చేసుకున్నారు. పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ బాలకృష్ణ తెలిపారు.






