రాయలసీమ బీట్ల సమయం వచ్చింది..

by Chukka Sudharani |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’.

రాయలసీమ బీట్ల సమయం వచ్చింది..
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ అందరిని ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్ ‘కంసామ్నీడా’ కు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘‘కంసామ్నీదా.. కిమ్చికారం’ కొరియన్ మాట్లాడటం పూర్తయింది.. ఇప్పుడు రాయలసీమ బీట్ల సమయం వచ్చింది.. కొరియన్ కనకరాజు నుంచి సెకండ్ సింగిల్ ‘రాసగుమ్మడి’ జులై 19న విడుదల కాబోతుంది’ అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. కాగా.. ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ మూవీ ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్‌లో హారర్, కామెడీ కలయికతో రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Next Story