- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులతో.. భూగర్భ జలాలు పెంపు
చెరువులతో.. భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయని.. పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య కూడా తలెత్తదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు.

దిశ, నాచారం : చెరువులతో.. భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయని.. పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య కూడా తలెత్తదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ నాచారం సర్కిల్ లోని నాచారం పెద్ద చెరువు రూ.28 కోట్లతో చేపడుతున్న పునరుద్ధరణ పనులకు గురువారం హైడ్రా కమిషనర్ ఏవి.రంగనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్లూ ప్రింట్ మ్యాపింగ్ కాపీని.. కమిషనర్ పరిశీలించారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. నాచారం హెచ్. ఎం. టి చెరువు హైడ్రా ఆధ్వర్యంలో దాదాపు 108 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ప్రభుత్వ నిధులు హెచ్ఎండిఏ ఫండ్స్ తో పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. గతం లో ఈ చెరువు మురికి కూపంగా మారిందని, సీవేజ్, డ్రైనేజ్ నీరు ఇందులో కలుస్తుండడంతో పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చెరువులో పేరుకుపోయిన సిల్ట్, మట్టిని దాదాపు 10 నుంచి 12 ఫీట్ల లోతు వరకు తొలగించి పునరుద్ధరణ చేస్తామని చెప్పారు.
తొలగించిన సిల్ట్‌ను ఎవరికీ ఇబ్బంది కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. స్థానిక బస్తీ వాసులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. 9 నుంచి ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులతో నాచారం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు విస్తారంగా పెరుగుతాయన్నారు. చెరువునలో 2 మిలియన్స్ క్యూబిక్ సెంటీమీటర్ నుంచి 5 మిలియన్స్ క్యూబిక్ సెంటీమీటర్ సామర్థ్యం పెరుగుతుందన్నారు. దీంతో నీటి సమస్యతో పాటు బోర్లు రీఛార్జ్ అవుతాయన్నారు. ఎండాకాలంలో నీటి సమస్య ఉండదన్నారు. ప్రస్తుత ఏలినో వాతావరణ సమస్య వల్ల నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. కూకట్పల్లిలో గతంలో 1000 మీటర్ల లోతు బోర్లు వేసిన చుక్కనీరు రాలేదని... ప్రస్తుతం 100 మీటర్లకే బోర్లు పుష్కలంగా పడుతున్నాయని చెప్పారు. చెరువు పనులు పూర్తయితే నాచారంలో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చెరువు గతంలో మూడెకరాల కబ్జాకు గురైందని.. ప్రస్తుత నివాసం ఉంటున్న స్థలాల జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ కనుగుణంగా.. నివాస స్థలాల్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టదని రంగనాథ్ స్పష్టం చేశారు.
బాబా నగర్ లో డంపింగ్ మట్టి పరిశీలన..
హెచ్ఎంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా తొలగించిన మట్టిని బాబా నగర్ కెమికల్ ఫ్యాక్టరీ ఆవరణలో డంపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల నాయకులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బాబా నగర్ లో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి హైడ్రా కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.






