- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోక్సో కేసులో కానిస్టేబుల్‌కు రక్షణ కవచమా.. ?
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో టూ టౌన్ పోలీసులు ఆరుగురు ఈ కేసులో ఉన్నట్లు తెలుపగా డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో టూ టౌన్ పోలీసులు ఆరుగురు ఈ కేసులో ఉన్నట్లు తెలుపగా డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే కేసులో మొత్తం నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎఫ్ఐఆర్ లో మొదటి నలుగురి నిందితుల పేర్లు , తండ్రి పేరు, వయస్సు, కులం , వృత్తి, నివాస మండలంతో పూర్తి వివరాలు ఇవ్వగా, ఐదవ నిందితుడి పేరు వచ్చేసరికి పేరు, వూరు, మండలం, ఇక ఆరవ నిందితుడి వివరాలు మాత్రం ఇంటి పేరు కూడా లేకుండా పేరు, మండలంతో సరిపెట్టారు. అంటే ఆ కానిస్టేబుల్ పూర్తి పేరు రాసేందుకు ఏమైనా ఒత్తిళ్లు పోలీసులకు ఎదురయ్యాయా..? లేక ఉద్దేశ పూర్వకంగా డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తుందనే ముందస్తు ఆలోచనతో వివరాలు పొందుపరచలేదో అర్ధం కానీ ప్రశ్నగా మిగిలింది.
పరారీలో ఇద్దరు...
ఎంత కరుడుగట్టిన రౌడీ షీటర్లను, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల కదలికను టెక్నాలజీ సహాయంతో ఇట్టే కనిపెట్టి సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు డిపార్ట్మెంట్ కు మంచి పేరు ఉంది. అయితే లైంగిక దాడి కేసులో ఎఫ్ఐఆర్‌లో చేర్చిన పేరులో ఉన్న 5,6 వ నిందితులు ఇంకా పోలీసులకు చిక్కకాపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిలో ఒకరు ఏఆర్ లేక టీ జీ పీ ఎస్ కానిస్టేబులా అనేది ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదైనప్పటికీ ఆయనను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై వివిధ వర్గాల్లో విసృతంగా చర్చ జరుగుతోంది.
కానిస్టేబుల్ ను కాపాడే ప్రయత్నమైనా జరుగుతుందా...?
బాలిక పై లైంగిక దాడి కేసులో 6వ నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ ను పక్కకు తప్పించే ప్రయత్నమేమైనా జరుగుతుందా అనే సందేహాలు ప్రతి సామాన్యుడిలో కలుగుతున్నాయి. పోలీసు డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ ఇలాంటి పనులకు పాల్పడటం పై నిజాయితీగా, క్రమశిక్షణగా, సమాజ శ్రేయస్సు కోసం కుటుంబాలను త్యాగం చేసి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొంతమంది అధికారులు, సిబ్బంది ఈ ఘటన పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వృత్తిలో ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత కానిస్టేబుల్‌ను కాపాడేందుకు కొందరి ద్వారా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పట్టణంలో జోరుగా వినిపిస్తోంది. చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్న పోలీసు శాఖ, ఈ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను ఎప్పుడు అరెస్టు చేస్తుంది? ఎఫ్ఐఆర్‌లో పేరు ఉన్న కానిస్టేబుల్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని నిబంధనల ప్రకారం నడుచుకుంటారా.. ? లేక చట్టం కొంతమంది పోలీసులకు చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తారో చూడాలి మరి.






