- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు గేదెల దొంగలు అరెస్టు
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ శివారులో గేదెలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ శివారులో గేదెలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె. నాగేశ్వరరావు తెలిపారు. గురువారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆరేటి పోచయ్యకు చెందిన రెండు గేదెలు, అదే గ్రామానికి చెందిన ఆరేటి వెంకటేష్‌కు చెందిన ఒక గేదెను గత మే 23వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర్ల వెంకటరావు, చిత్తూరి గంగాధర్, వీర్ల మల్లికార్జునరావుగా గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ప్రత్యేక పోలీసు బృందాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి పంపగా ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని, వారి వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన తంగళ్లపల్లి ఎస్‌ఐ ఉపేంద్రచారి, ఎస్‌ఐ-2 మల్లేశం, పోలీసు సిబ్బంది సంపత్‌కుమార్, శ్రీనివాస్‌లను సీఐ కె. నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.






